పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేసే అదనపు సహజ వాయువు ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా అప్‌స్ట్రీమ్ గ్యాస్ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మార్చి 16, ఉదయం 6 గంటల నుండి అమలులోకి రానున్నాయి. పారిశ్రామిక వినియోగదారులు తమ కాంట్రాక్ట్ పరిమితికి మించి వాడే అదనపు గ్యాస్ ధరపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల భారతదేశానికి వచ్చే ఎల్‌ఎన్‌జీ సరఫరాలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు పారిశ్రామిక వినియోగదారులు తమ కాంట్రాక్ట్ వాల్యూమ్‌లో 40 శాతానికి వినియోగాన్ని తగ్గించుకోవాలని కంపెనీ గతంలోనే కోరింది. సరఫరా సవాళ్లు ఉన్నప్పటికీ, అప్‌స్ట్రీమ్ ధరలు తగ్గడంతో ఆ లాభాన్ని వినియోగదారులకు అందించాలని అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ నిర్ణయించింది. గ్యాస్ పంపిణీ సమానంగా జరగాలని, అదే సమయంలో సిస్టమ్ స్థిరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ధరల సవరణ చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ధరల తగ్గింపు కేవలం పారిశ్రామిక, వాణిజ్య విభాగాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అదానీ గ్యాస్ వాల్యూమ్‌లో 70 శాతం గృహ అవసరాలకు, వాహనదారులకే సరఫరా అవుతుంది. ఈ విభాగాల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన 30 శాతం దిగుమతి చేసుకున్న ఎల్పీజీ ద్వారా వస్తుంది. దీనినే పరిశ్రమలకు కేటాయిస్తారు. ప్రస్తుత తగ్గింపు ఈ విభాగానికే వర్తిస్తుంది.
పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేసే అదనపు సహజ వాయువు ధరలను తగ్గించిన ఆదానీ గ్రూప్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق