స్టేజీపై కూర్చున్న కుర్చీ నుంచి ఒక్కసారిగా కింద పడ్డ నాగ చైతన్య

الخميس، 5 مارس 2026

'Vrushakarma' movie glimpse release ceremony at Prasad IMAX cinema Naga Chaitanya suddenly fell from the chair he was sitting on the stage

t f B! P L


హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో  'వృషకర్మ' సినిమా గ్లింప్స్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కినేని నాగచైతన్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేజీపై నాగ చైతన్య కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా కింద పడిపోయింది. దాంతో నాగ చైతన్య కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన నాగ చైతన్య సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని పైకి లేపింది. అలా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఆయన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అభిమానులు కంగారుపడటం గమనించిన చైతూ ఏమీ కాలేదని నవ్వుతూ వారికి సైగ చేశాడు. ఆ తర్వాత ఏమాత్రం తడబడకుండా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టేక్ కేర్ చైతూ అని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో వస్తున్న 'వృషకర్మ' సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్​ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్​ గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​ సోషల్​ మీడియాలో ట్రెండింగ్​ లో ఉంది. సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్‌ లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Most Popular

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ