ఫ్లిప్‌కార్ట్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G' పై పరిమిత కాల ఆఫర్లను ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ లిస్టింగ్ ధర రూ.24,999గా ఉండేది. ఇప్పుడు తగ్గింపుతో రూ.19,999కే అందుబాటులో ఉంది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్లు ఉపయోగించి ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉన్న వారికి మరో రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ప్లాన్లను కూడా అందిస్తోంది. నెలకు కేవలం రూ. 3334 నుండి వాయిదా పద్ధతులు ప్రారంభమవుతాయి. పాత మొబైల్ మార్పిడి చేసుకునేందుకు ఎక్స్ఛేంజ్ బోనస్ సదుపాయం కూడా ఉంది. పాత ఫోన్ కండిషన్ బాగుంటే గరిష్టంగా రూ.18850 వరకు తగ్గింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో అదిరిపోయే కెమెరా సెటప్ ఉంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అమర్చారు. సెల్ఫీలు ఇష్టపడే వారి కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని ద్వారా 4K క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల అమోలెడ్ ప్యానల్ ఉంటుంది. దీనికి 120Hz రీఫ్రెష్ రేట్ తోడు కావడంతో స్క్రీన్ ఎంతో స్మూత్ గా కనిపిస్తుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇందులో ఉంది. స్క్రీన్ భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కల్పించారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ వాడారు. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మెమరీ కార్డు ద్వారా స్టోరేజీని ఒక టెరాబైట్ వరకు పెంచుకునే వీలుంది. ఎక్కువ సేపు బ్యాటరీ రావడానికి 5,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేసేందుకు 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. నీటిలో పడినా పాడవకుండా IP69 రేటింగ్ రక్షణ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ ధృవీకరణ ఉండటం వల్ల ఫోన్ ఎంతో దృఢంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత మోటో యూఐ తో పనిచేస్తుంది. ఇందులో అత్యాధునిక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోటోల్లో నచ్చని వస్తువులను తీసేయడానికి ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఎడిటర్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అలాగే ఏదైనా వస్తువు గురించి వెతకడానికి 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. స్లిమ్ డిజైన్ తో పాటు ప్రీమియం లుక్ కలిగి ఉండటం వల్ల ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకుంటుంది.
ఫ్లిప్‌కార్ట్ లో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق