క్రికెటర్ మహ్మద్ షమీపై గృహ హింస, భరణం కేసుల్లో  షమీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. షమీ మాజీ భార్య హసిన్ జహాన్ కోల్‌కత్తాలో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో కోర్టు విచారణల కోసం పశ్చిమబెంగాల్‌కు తరచుగా వెళ్లడం తనకు కష్టంగా మారుతోందని ఆమె వెల్లడించారు. మహ్మద్ షమీ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ క్రికెటర్ కావడంతో మ్యాచ్‌ల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తుంటాడని, అందువల్ల కేసును దిల్లీకి మార్చినా అతనికి ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదనంగా, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న షమీ కుటుంబ నివాస ప్రాంతం కోల్‌కతాతో పోలిస్తే దిల్లీకి భౌగోళికంగా సమీపంలో ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.ఈ కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని కేసును దేశ రాజధానికి బదిలీ చేస్తే కోర్టు విచారణలకు హాజరు కావడం తనకు సులభమవుతుందని ఆమె వాదించారు. దీనిపై స్పందించాలని సుప్రీంకోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఇటీవల తనకు, తన కూతురి నెలవారి జీవనాధారానికి ఇచ్చే భరణాన్ని రూ.4 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని హసిన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మహ్మద్ షమీ,హసిన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో కుమార్తె జన్మించింది.అనంతరం 2018లో షమీపై గృహహింస ఆరోపణలు చేస్తూ హసిన్ జహాన్ ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు ఆధారంగా షమీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

أحدث أقدم