స్పెయిన్‌కి చెందిన ట్రెయిన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాం అయిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సొల్యూషన్స్‌ (ట్రెనెస్‌)లో మెజారిటీ వాటాలను ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 125 కోట్లుగా ఉంటుంది. యూరోపియన్‌ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్‌ యాజ్‌ సర్వీసెస్ అనే ఇంకో స్పానిష్‌ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్‌క్యూఏఏఎస్‌ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంబంధ సేవలను అందిస్తోంది.

Post a Comment

أحدث أقدم