లోక్‌సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎనిమిది మంది ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), పంజాబ్ ఎంపీలు గుర్జీత్ సింగ్ ఔజ్లా (కాంగ్రెస్), అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (కాంగ్రెస్), కేరళ ఎంపీలు హిబి ఈడెన్ (కాంగ్రెస్), డీన్ కురియాకోస్ (కాంగ్రెస్), తమిళనాడు ఎంపీలు మాణిక్కం ఠాగూర్ (కాంగ్రెస్), ఎస్.వెంకటేశన్ (సీపీఎం), మహారాష్ట్ర ఎంపీ ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్) ఉన్నారు. దీనిపై చామల కిరణ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతుండగా మైక్‌ కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశామని, తమ నోరు మూయించాలని బీజేపీ యత్నిస్తోందని అన్నారు.

Post a Comment

أحدث أقدم