ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఇతర అజెండా అంశాలను పక్కనపెట్టి తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపైనే సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని కేబినెట్ అభిప్రాయపడింది. సీబీఐ, సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో కేబినెట్ చర్చల వివరాలను వెల్లడించారు. ఈ అంశంపై రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని, కేవలం భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, శ్రీవారి క్షేత్ర పవిత్రతను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ ఈ అంశంపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారని తెలిపారు.
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం : దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق