వాట్సాప్‌ను బ్లాక్ చేసిన రష్యా : సొంత సాంకేతికతో డెవలప్ చేసిన మ్యాక్స్ యాప్‌

الخميس، 12 فبراير 2026

government's intention is to divert the country's social media users towards it Max app developed with its own technology Russia blocks WhatsApp science tyechnology

t f B! P L


రష్యా తన సొంత సాంకేతికతో మ్యాక్స్ అనే ఓ సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌ను డెవలప్ చేసింది. పూర్తిగా అక్కడి ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్లాట్ ఫామ్ ఇది. దేశంలోని సోషల్ మీడియా యూజర్లను దీని వైపు మళ్లించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని టాస్ మీడియా సంస్థ తెలిపింది. ఈ ప్రత్యామ్నాయ యాప్‌ను నిఘా కోసం ఉపయోగించవచ్చని వాట్సాప్ ఆరోపించగా, రష్యా దీన్ని తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని నిఘా యాప్‌లకు ప్రజలను మళ్లించే ప్రయత్నాలలో భాగంగానే వాట్సాప్ ను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమ నెట్ వర్క్ బ్లాక్ అయినప్పటికీ- వంద మిలియన్లకు పైగా ఉన్న తమ వినియోగదారులను కనెక్ట్‌ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని వాట్సప్ మేనేజ్మెంట్ వివరించింది. రష్యాలో ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్న దశలో వాట్సప్ బ్లాకింగ్ తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదీర్ఘకాలంగా ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం నేపథ్యంలో అనేక పాశ్చాత్య దేశాలు, అక్కడి టెక్ సంస్థల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. గ్లోబల్ టెక్ కంపెనీలన్నీ కూడా తమ దేశీయ చట్టాలను పాటించడంలో విఫలమయ్యాయని, సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేస్తోన్నాయని, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా అవాస్తవాలనూ ప్రచారం చేస్తోన్నాయని రష్యా చాలాకాలం నుంచి ఆరోపిస్తూ వస్తోంది. తమ దేశంలో వాట్సాప్ సేవలు తిరిగి పునరుద్ధరణకు నోచుకోవాలంటే మెటా.. స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. మెటా రాజీ పడని వైఖరిని అవలంబిస్తే, వాట్సాప్ పునరుద్ధరణకు అవకాశం ఉండబోదని తేల్చి చెప్పారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ