ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితాల తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ప్రక్రియపై నిమగ్నమవుతున్నారు. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని ఆదేశించింది. ఇలా తయారు చేసిన ఓటరు జాబితాలను మార్చి 9న అధికారికంగా ప్రచురించబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈ లెక్కన మార్చి 9న ఓటరు జాబితాల్ని ప్రచురిస్తే..ఆ తర్వాత ఏ క్షణంలో అయినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. నియోజకవర్గాల పునర్ విభజన, జనాభా గణనతో వీటికి ఎలాగో సంబంధం లేదు కాబట్టి ఈ ఏడాదిలోనే ఈ ఎన్నికల నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు : ఎన్నికల జాబితాల తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق