మార్చి 2 నుంచి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 స్పెయిన్ లో జరుగుతుంది. దీనిలో లెనోవో 3D స్టీరియోస్కోపిక్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్స్‌లో గ్లాసెస్ లేకుండా 3D వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగే ల్యాప్‌టాప్‌లు ఇవి కావచ్చు. ఈ డివైస్ యోగ బుక్ ప్రో 3D పేరుతో రావచ్చని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఈ ల్యాప్‌టాప్ అడ్వాన్స్‌డ్ స్టీరియోస్కోపిక్ 3D డిస్‌ప్లే టెక్నాలజీతో రావచ్చు. స్పెషల్ గ్లాసెస్ లేకుండానే స్క్రీన్‌లో డెప్త్ ఎఫెక్ట్స్ అనుభూతి పొందవచ్చు. డ్యూయల్-డిస్‌ప్లే సెటప్ ఉండవచ్చు. ఇది ప్రొడక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటికీ ఉపయోగపడుతుంది. టిప్‌స్టర్ ఎవాన్ బ్లాస్ ఈ కాన్సెప్ట్ గురించి అందరి కంటే ముందు సమాచారం షేర్ చేశాడు. రెండు ఇంటరాక్టివ్ స్క్రీన్లు ఉండవచ్చని చెప్పాడు. కానీ వివరణాత్మక స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు. క్రియేటర్లు, ప్రొఫెషనల్ యూజర్లను టార్గెట్ చేస్తుంది. డిజైన్, విజువలైజేషన్ టాస్క్‌లకు 3D సామర్థ్యం సహాయపడుతుంది. ఇమ్మర్సివ్ మీడియా కన్సంప్షన్ కూడా మెరుగవుతుంది. స్లిమ్ టిప్ పవర్ కనెక్షన్ సపోర్ట్ ఉండవచ్చు. ఇది హై పవర్ కన్సంప్షన్ డివైసెస్‌లో సాధారణ విషయం. ల్యాప్‌టాప్‌కు ఎక్కువ వాటేజ్ ఛార్జింగ్ అవసరం కావచ్చు. డ్యూయల్ USB Type-C పోర్ట్స్ ఉండవచ్చు. HDMI పోర్ట్ కూడా ఉండవచ్చు. పోర్ట్స్ ఎడమ వైపు ఉండవచ్చని టెక్ సోర్సెస్ ద్వారా తెలిసింది. బిల్ట్-ఇన్ అడ్జస్టబుల్ స్టాండ్ ఉండవచ్చు. ఇది వ్యూయింగ్ యాంగిల్స్, కంఫర్ట్ మెరుగుపరుస్తుంది. డిజైన్ ఫ్లెక్సిబిలిటీ, పోర్టబిలిటీపై దృష్టి పెట్టవచ్చు.

Post a Comment

أحدث أقدم