హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థుల కారు అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని, డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేక£పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. దీంతో కారు రోడ్డు పక్కన మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొనగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వీరంతా ఒకే ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా, లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు : ఇద్దరు విద్యార్థులు మృతి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق