ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం ఏడాదికి రూ. 4,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్ మొబైల్, వై-ఫై (బ్రాడ్‌బ్యాండ్), డీటీహెచ్ కస్టమర్లు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ సేవలను పొందవచ్చు. ప్రపంచంలోనే ఒక టెలికాం కంపెనీ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారి అని సంస్థ పేర్కొంది. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి, విద్యార్థులకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇది ఒక వరమని చెప్పవచ్చు. AI టూల్స్ ద్వారా డిజైన్ అనుభవం లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రొఫెషనల్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేయవచ్చు. ఇందులో వేలాది డిజైన్ టెంప్లేట్లు, 30,000కు పైగా ప్రీమియం ఫాంట్లు అందుబాటులో ఉంటాయి. ఫైల్స్ భద్రపరుచుకోవడానికి 100GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. వన్-ట్యాప్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, నో వాటర్‌మార్క్స్, ఆటో క్యాప్షన్స్ మరియు ఇన్‌స్టంట్ రీసైజ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق