డ్జెట్ రూపకల్పన పనులు తుది దశకు చేరుకున్నాయని సూచిస్తూ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో మంగళవారం హల్వా వేడుక జరిగింది. హల్వా వేడుకతో బడ్జెట్ లాక్-ఇన్​పీరియడ్ ప్రారంభం అవుతుంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో వార్షిక పద్దును ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. ఒకసారి పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాతే వీరు బయటకు వస్తారు. అంటే ఐదురోజులపాటు వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవన్నమాట. 1950లో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అవ్వడంతో ఈ లాక్‌-ఇన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

أحدث أقدم