మెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన లీడర్‌షిప్ కోర్సును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  విజయవంతంగా పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ఆయనకు అధికారిక సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 25 నుంచి 30 వరకు 'లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ' అనే పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పాలనా సవాళ్లు, ఆధునిక నాయకత్వ లక్షణాలు, ప్రజా విధానాల రూపకల్పన వంటి అంశాలపై ఈ కోర్సులో సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులు, నాయకులు, పాలసీ మేకర్లు హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులతో కలిసి తరగతులకు హాజరై, విభిన్న అనుభవాలు, ఆలోచనలను తెలుసుకునే అవకాశం లభించిందని సీఎం పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లోని అధ్యాపకులు, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవం పాలనలో మరింత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, పాలసీ మేకర్లు, సీనియర్ అధికారుల కోసం ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సులను నిర్వహిస్తుంది. అందులో భాగంగా నిర్వహించిన 'లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ' కార్యక్రమం ఆధునిక పాలనా సవాళ్లు, గ్లోబల్ పాలిటిక్స్, ప్రజా విధానాల రూపకల్పన, సంక్షోభ నిర్వహణ, నైతిక నాయకత్వం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ నిపుణుల నేతృత్వంలో జరిగే ఈ తరగతుల్లో కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్లు, ప్రాక్టికల్ మాడ్యూల్స్ ద్వారా పాల్గొనేవారికి సమగ్ర అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఎంపికైన ప్రతినిధులు హాజరయ్యారు. విభిన్న రాజకీయ, పరిపాలనా నేపథ్యాల నుంచి వచ్చిన పాల్గొనేవారు పరస్పరం అనుభవాలను పంచుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన పాలనా నమూనాలపై చర్చిస్తారు. ఈ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా పాల్గొనేవారు వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యం, ప్రజా సేవలో సమర్థతను పెంపొందించుకునే అవకాశం పొందుతారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్కింగ్‌కు ఇది ఒక ముఖ్య వేదికగా నిలుస్తోంది.

Post a Comment

أحدث أقدم