హైదరాబాద్ నగరంలో అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపింది. ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు.. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణం 'నీరూస్' తో పాటు నాంపల్లిలోని మరో ఫర్నిచర్ షోరూంను సీజ్ చేశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు రంగంలోకి దిగారు. నాంపల్లి ప్రాంతంలోని పలు ఫర్నిచర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్నిమాపక నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎగ్జిట్ మార్గాలను అడ్డుకుంటూ స్టాక్ ఉంచినట్లు గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించని కొన్ని షాపులను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. సెల్లార్లను పార్కింగ్ కోసం కాకుండా గోదాములుగా వాడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు హైడ్రా ఒక ప్రత్యేక వాట్సాప్/కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667ను అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ లోని నీరూస్ షోరూమ్, ఫర్నీచర్ షోరూంను సీజ్ చేసిన హైడ్రా !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق