తెలంగాణ లోని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు ఆనంద్ భంగం కలిగించారని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి స్పీకర్‌కు ముడుపులు ముట్టాయి కాబట్టే నిర్ణయం తీసుకోవడం లేదని స్థానికంగా ప్రచారం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఇవాళ లీగల్ నోటీసులు పంపించారు.
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు లీగల్ నోటీసులు పంపిన అసెంబ్లీ స్పీకర్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق