కేరళలో లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అంతరిక్ష వ్యోమగామిసునీతా విలియమ్స్ మాట్లాడుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన రోజులను పంచుకున్నారు. అంతరిక్షంలో ప్రతి రోజు కొత్త సవాళ్లతో పాటు కొత్త నేర్పును ఇస్తుందని ఆమె తెలిపారు. భూమిపై సాధారణంగా కనిపించే విషయాలే అక్కడ అద్భుతంగా అనిపిస్తాయని, శూన్య గురుత్వాకర్షణలో జీవించడం మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల పాత్ర మరింత కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. యువత శాస్త్రం, సాంకేతిక రంగాల వైపు దృష్టి పెట్టాలని, అంతరిక్ష ప్రయాణాలు భూమిపై జీవన ప్రమాణాలను మెరుగుపర్చే కొత్త పరిజ్ఞానానికి మార్గం వేస్తున్నాయని వివరించారు. అంతరిక్షంలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కల్పనా చావ్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని సునీతా భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. కల్పనా తనకు స్ఫూర్తిగా నిలిచారని, ఆమె కలలు ఇప్పటికీ తన ప్రయాణానికి దారి చూపుతున్నాయని చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు సాగవచ్చన్న నమ్మకాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తిగా కల్పనాను ఆమె కొనియాడారు. ఈ నెల 25 వరకూ కొనసాగనున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో సాహిత్యం, విజ్ఞానం, సమాజం మధ్య ఉన్న సంబంధాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సునీతా విలియమ్స్ వంటి అంతర్జాతీయ స్థాయి వ్యక్తిత్వాల పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. నటుడు ప్రకాశ్‌రాజ్-వ్యోమగామి సునీతా విలియమ్స్ భేటీ ఈ సాహిత్య సమ్మేళనానికి మరింత గుర్తింపు తీసుకొచ్చిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సునీతా విలియమ్స్‌ను ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సునీతా విలియమ్స్‌ను కలిసిన అనంతరం, ఆమెతో కలిసి దిగిన ఫొటోలను ప్రకాశ్‌రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "అసాధారణమైన ధైర్యం ఉన్న వ్యక్తిని కలవడం జీవితంలో అరుదైన అనుభవం" అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. సునీతాతో జరిగిన సంభాషణ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమని ఆయన పేర్కొన్నారు.
శూన్య గురుత్వాకర్షణలో జీవించడం మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది : అంతరిక్ష వ్యోమగామిసునీతా విలియమ్స్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق