ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి పశువుల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పశువులు అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా మరణించినప్పుడు రైతులకు ఆర్థిక నష్టం జరగకుండా వారికి ఆర్థిక సహాయం అందించటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో పాడి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పశువుల బీమా పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు పేర్కొంది. ఈ పశువుల బీమా పథకంలో భాగంగా ప్రీమియం వాటాలో 15% రైతు చెల్లిస్తే 85% ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి పెంపుడు జంతువులకు ఈ బీమా పథకం వర్తిస్తుంది. పశువుల విలువను బట్టి పరిహారాన్ని నిర్ణయించడం జరుగుతుంది గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలకు, 100 గొర్రెలు లేదా మేకలకు, 50 పందులకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా లో భాగంగా 30 వేల రూపాయలు విలువైన పశువుకు రైతు కేవలం 288 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 15వేల రూపాయలు విలువైన పశువుకు 144 రూపాయలు, ఆరువేల రూపాయలు విలువైన గొర్రెలు లేదా మేకలకు 27 రూపాయలు మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది. మేలు జాతి ఆవులు గేదెలకు 15వేల నుండి 30వేల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. మేలు జాతి ఎద్దులు, దున్నలు 30 వేల రూపాయలు బీమా వర్తిస్తుంది. నాటు ఎద్దులు, దున్నలు 15వేల రూపాయల బీమా, గొర్రెలు మేకలకు ఆరువేల రూపాయల బీమా అందుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరికొద్ది రోజులే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి 31వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలలో పశువులకు పరీక్షలతో పాటు, బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ఈ బీమా నేరుగా రైతుల ఖాతాకే లింక్ అవుతుందని వెల్లడించింది.
إرسال تعليق