నేటి నుండి 16,000 మంది ఉద్యోగులను అమెజాన్ సంస్థ తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు రెడిట్ లో వస్తున్న కథనాల ప్రకారం, ఈ లేఆఫ్స్ వల్ల భారతదేశం తీవ్రంగా ప్రభావితం కానుంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. దేశంలో సుమారు 1,20,000 మంది అమెజాన్ ఉద్యోగులు ఉన్నారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై లోని కార్యాలయాల్లో భారీగా ఉద్యోగాల కోత ఉండవచ్చు. ఈ నగరాల్లో అమెజాన్‌కు చెందిన ప్రధాన సాంకేతిక మరియు కార్పొరేట్ బృందాలు ఉండటమే ఇందుకు కారణం. 2026 మధ్య నాటికి మొత్తం 30,000 కార్పొరేట్ పోస్టులను తొలగించాలని అమెజాన్ ప్రణాళిక వేస్తోంది. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో భారీ కోతలు ఉండవచ్చు.మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ విభాగాలపై కూడా ప్రభావం పడనుంది. అలెక్సా వంటి పరికరాలను తయారు చేసే బృందాల్లో కూడా తొలగింపులు ఉంటాయి. ఈ-కామర్స్ మరియు పేమెంట్స్ విభాగాలను కూడా కంపెనీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కంపెనీ వేగంగా వృద్ధి చెందిన సమయంలో పెరిగిన అదనపు పరిపాలనా విభాగాలను తగ్గించి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యమని అమెజాన్ నాయకత్వం చెబుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హెచ్‌ఆర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మరియు కస్టమర్ సపోర్ట్ వంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఐటీ యూనియన్ల నిరసన: ఐటీ ఉద్యోగుల సంఘం అమెజాన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ, ఇలా ఉద్యోగులను తొలగించడం చట్టవిరుద్ధమని మరియు ఇది కార్మికుల జీవనోపాధిపై జరుగుతున్న దాడి అని వారు పేర్కొన్నారు.
إرسال تعليق