హైదరాబాద్ లోని నార్సింగి ప్రాంతంలో ఈరోజు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకుని పరిశీలించారు. ఈ పరిశీలనలో సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి, డీ-అడిక్షన్ సెంటర్‌కి తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సుధీర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరూ సరఫరా చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కేసును పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
السبت، 3 يناير 2026
Andhra Pradesh Criem Jammalamadugu BJP MLA's son arrested in drugs case Sudheer Reddy tested positive for drugs telangana
ليست هناك تعليقات:
إرسال تعليق