దేశీయ మార్కెట్లో లావా బ్లేజ్‌ డుయో 3 స్మార్ట్‌ఫోన్ విడుదలై అమ్మకానికి అమెజాన్‌ లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌ లో రూ.20000 ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని లీక్స్‌ ఆధారంగా ఈ లావా బ్లేజ్‌ డుయో 3 స్మార్ట్‌ఫోన్‌ రూ.16999 ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బ్లాక్‌, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుందని తెలుస్తోంది. అమెజాన్ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 6.6 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 1.6 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఈ రెండో డిస్‌ప్లేతో నోటిఫికేషన్లు, మ్యూజిక్‌ కంట్రోల్‌, ఎంపిక చేసిన యాప్స్‌ ను వినియోగించుకోవచ్చు. ఈ లావా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఎన్ని సంవత్సరాల అప్‌డేట్స్‌ పొందనుందో విడుదల సమయంలో వెల్లడి కానుంది. ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 అపేచర్‌ తో 50MP AI కెమెరాను కలిగి ఉంటుంది. మరో లెన్స్‌ వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 7.55mm థిక్‌నెస్‌ తో 181 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.2, GPS, వైఫై, నేవిగేషన్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను అమర్చి ఉంటుంది. IR బ్లాస్టర్‌ ను కూడా కలిగి ఉంటుంది. 

Post a Comment

أحدث أقدم