దేశీయ మార్కెట్లో జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు టెక్నో ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీతో టీజింగ్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన టీజర్ పీజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్పార్క్ స్మార్ట్ ఫోన్ పర్పల్ కలర్ వేరియంట్ లో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది మరియు చాలా సింపుల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక సింగిల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ఒక ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అనుకోకుండా 1.2 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా కూడా తట్టుకునే సత్తా కలిగి ఉంటుందని స్పార్క్ చెబుతోంది. ఇదే కాదు, ఈ ఫోన్ IP 64 రేటింగ్ డస్ట్ అండ్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా నెట్ వర్క్ లేని సమయంలో పని చేసే ఆఫ్ లైన్ కాల్ ఫీచర్ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ దమ్ దార్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందట. ఈ ఫోన్ 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ తో 4 సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని టెక్నో తెలిపింది. ఈ ఫోన్ ను కూడా Ella AI సపోర్ట్ తో టెక్నో లాంచ్ చేస్తుంది.
إرسال تعليق