ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో చెవిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి. మిథున్‌రెడ్డి, వెంకటేష్‌, ధనుంజయ, కృష్ణమోహన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మిగిలిన నిందితులు కూడా తమకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం నిందితుల రిమాండ్ గడువును ఫిబ్రవరి 13 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులకు కోర్టులో నిరాశ ఎదురైంది. ఇప్పటికే వీరంతా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకూ బెయిల్ మంజూరు అవుతుందోమోనన్న ఆశలో పిటిషన్ దాఖలు చేశారు. 

Post a Comment

أحدث أقدم