పాధి హామీ పథకం 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' పేరును  'పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన'గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. పనిదినాల్లో కూడా మార్పు చేశారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులుగా విస్తరించారు. గ్రామీణ కార్మికులకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని కూడా రూ.240కి పెంచాలని నిర్ణయించారు. పథకాన్ని మరింత బలపర్చడానికి కేంద్రం రూ.1.51 లక్షల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది. 2005లో ప్రారంభమైన ఈ ఉపాధి పథకం యూపీఎ ప్రభుత్వం కాలంలో అమల్లోకి వచ్చింది. తర్వాత దీనికి మహాత్మా గాంధీ పేరు జతచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించేందుకు, నైపుణ్యం లేని కార్మికులకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని హామీ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఇప్పుడు పనిదినాల పెంపుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం చేసిన తాజా మార్పులతో గ్రామీణ ఉపాధిలో నాణ్యత, స్థిరత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم