ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల కొత్త డ్వాక్రా గ్రూపులకు రూ 3 కోట్ల మేర రివాల్వింగ్ ఫండ్ ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు వీలుగా ఈ రివాల్వింగ్ ఫండ్ ను డ్వాక్రా సంఘాల సభ్యులు వినియోగించుకోనున్నారు. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు రూ 15 వేలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఖరారు చేసింది. ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకొన అవకాశం కలుగుతుంది. సంఘంలోని సభ్యుల అవసరాలకు అనుగుణంగా డ్వాక్రా సంఘం ఈ నిధుల వినియోగం పైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఫండ్ ద్వారా సంఘాలు తమ ఉత్పత్తుల కోసం బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నిధులను ప్రభుత్వం త్వరలోనే సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల ద్వారా కొత్త డ్వాక్రా సంఘాలు ఆర్దికంగా తమ బలం పెంచుకునే అవకాశం కలుగుతుంది.
కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق