ప్లాటినా బైక్‌ను అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చిన బజాజ్

السبت، 6 ديسمبر 2025

automobile Bajaj has updated the Platina bike and brought it to the market Bajaj Platina 100 Platina 110 drum science technology

t f B! P L


బాజాజ్ కంపెనీ బజాజ్ ప్లాటినా బైక్‌ను మరింత అప్‌డేట్ చేసి వినియోగదారులకు బజాజ్ ప్లాటినా 100, మరోటి ప్లాటినా 110 డ్రమ్‌ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీలెవెల్ ప్లాటినా 100ను వినియోగదారులు తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 65,407 మాత్రమే, ఇక ప్లాటినా 110 విషయానికి వస్తే దీని ఎక్స్‌షో రూమ్ ధర రూ.69,284గా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన ప్లాటినా 100లో 102 సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ కలిగి ఉంది. బజాజ్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఇంజిన్ తక్కువ పెట్రోల్‌ను యూజ్ చేసుకొని ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అందుకే ఇది మార్కెట్‌లో మైలేజ్ రారాజుగా పేరొందింది. ఇది డేలీ ఆఫీస్ వెళ్లే వారికి, ఫుడ్‌ డెలివరీ, రాపిడో రైడర్స్, రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బైక్‌ 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఈ బైక్‌ను ఒక్కసారి ఫుల్‌ ట్యాంక్ చేస్తూ దాదాపు 7 నుంచి 8 వందల కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక ప్లాటినా 110, 100 కన్నా పవర్ ఫుల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది లాంగ్‌ రైడ్స్ వెళ్లే వారికి డిజైన్ చేయబడింది. ఇది 115.45 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ సరికొత్త టెక్నాలజీ థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగుపరుస్తుంది. ఈ బైక్ ఇంజన్ పవర్‌తో మీరు ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణించేప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోరు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ