తెలంగాణాలో సీఎం అధికారంలో ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడేవారు అసభ్య పదజాలంతో దూషించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు తిట్టుకుంటుంన్నారంటే పాలనలో వారు విఫలమైనట్టేనన్నారు. సంస్కారం గురించి క్లాసులు చెప్పే పార్టీలు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉండి అసభ్యంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కంటే ప్రతిపక్షాల మధ్య తిట్ల పురాణమే ఎక్కువగా వినిపిస్తోందన్నారు. అభివృద్ధిపై చర్చను పక్కనపెట్టి గొడవలతో కాలక్షేపం చేయటం దురదృష్టకరమన్నారు.
తెలంగాణాలో అభివృద్ధిపై చర్చను పక్కనపెట్టి గొడవలతో కాలక్షేపం చేయడం దురదృష్టకరం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق