తెలంగాణ ఫోన్‌ ‍ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు రావాల్సిందిగా సిట్‌ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేతృత్వంలోని కొత్త సిట్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమేష్‌ కుమార్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్‌కు కూడా నోటీసులు జారీ కావడం గమనార్హం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును ప్రస్తుతం సిట్‌ రెండో దఫా కస్టోడియల్‌ విచారణ జరుపుతోంది. కేసీఆర్‌ హయాంలో పని చేసిన ఇద్దరు సివిల్‌ సర్వెంట్స్‌ అధికారులకు నోటీసులు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే టాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించిన సిట్ భావిస్తున్నట్లు తాజా నోటీసులతో స్పష్టమవుతోంది. ప్రభాకర్రావు ఫోన్ ట్యాపింగ్‌ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను ఇప్పటికే సిట్‌ విచారణ జరిపింది. గతంలో సోమేష్‌కుమార్‌తో పాటు నవీన్‌ చంద్‌లకు నోటీసులు ఇచ్చి.. వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. నవీన్‌ చంద్‌ను ఓసారి ప్రభాకర్‌రావు ఎదుట ఉంచి వివరాలడిగి.. ఆ తర్వాత ఆయన వద్దకే వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసింది. ప్రస్తుతం అనుబంధ ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసేందుకుకే విచారణకు పిలిచినట్లు సిట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎస్‌ఐబీ ఓస్డీగా ప్రభాకర్‌రావును ఎలా నియమించారని సోమేష్‌కుమార్‌ను సిట్‌ మరోసారి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అలాగే నవీన్‌ చంద్‌ హయాంలోనే ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు పని చేశారు. దీంతో.. ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్‌ రావు ఇచ్చారనేదానిపై నవీన్‌ చంద్‌ను విచారించే అవకాశం లేకపోలేదు. డిసెంబర్‌ 25వ తేదీతో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనుంది. దీంతో ఈ కేసులో వీళ్లిద్దరి విచారణపై ఆసక్తి నెలకొంది.

Post a Comment

أحدث أقدم