కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాబోయే జనగణన దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ జనగణన కానుంది. ఈ జనగణన ప్రక్రియకు సంబంధించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా నిర్ణయించడం జరిగింది. ఈ భారీ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది, రెండవ దశ ఫిబ్రవరి 2027లో పూర్తవుతుంది. ఈసారి జరగబోయే జనగణనలో ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చారు. ఈసారి జనగణనలో కులం ఆధారిత గణనను కూడా చేర్చనున్నారు. ఈ చారిత్రాత్మక జనగణన నిర్వహణ కోసం రూ.11,718 కోట్లకు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశంలో దేశీయంగా ఉత్పత్తి పెరగడం వలన, ఆర్థికపరమైన నిర్ణయాల సానుకూల ఫలితంగా దేశానికి సుమారు రూ.60,000 కోట్ల విదేశీ కరెన్సీ ఆదా అవుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
إرسال تعليق