ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఋషికొండ తీర ప్రాంతంలో మత్స్యకారులకు అరుదైన చేప జాతికి చెందిన చేప చిక్కింది. శరీరంపై విభిన్నమైన చారలతో ప్రత్యేకంగా కనిపించింది. ఈ చేప తీరానికి చేరేలోగా నిర్జీవంగా మారింది. స్పాటెడ్ మోరే ఈల్స్ గా పిలవబడే ఈ చేపల రకానికి చెందిన జీవిని మన మత్స్యకారులు కలిమొయిగా పిలుస్తారు. చూడ్డానికి ఈ చేప చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని శరీరంపై చిరుత పులి లాంటి చారలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సముద్రంలో లోతైన ప్రాంతాల్లో ఉండే రాళ్ల మధ్య ఆవాసం ఏర్పరుచుకొని ఇవి జీవనం సాగిస్తాయి. ఈ కలిమొయి చేపకు పదునైన దంతాలు ఉంటాయి. ఇది దాదాపుగా 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని సముద్ర మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రం లోని లోతైన ప్రాంతంలో జీవించే ఈ చేపలు రాత్రిపూట ఎక్కువగా ఆహార అన్వేషణ చేస్తూ ఉంటాయని, ఇవి వలకు చిక్కడం చాలా అరుదని అధికారులు అంటున్నారు.
إرسال تعليق