భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2026 అర్హత పోటీలుగా భావించే ఈవెంట్లో పోటీ పడేందుకు చైనాకు వెళ్లాల్సి ఉండటంతో వీసాకు దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ఇందుకు చైనా కారణాన్ని వెల్లడించలేదు. 28 ఏళ్ల సుమిత్ చైనా ఆతిథ్యమివ్వబోతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసియా-పసిఫిక్ వైల్డ్‌కార్డ్ ప్లేఆఫ్‌లో పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్-2026కు అర్హతగా భావించే ఈ పోటీలు నవంబర్ 24 నుంచి 29 మధ్య చైనాలోని చెంగ్‌డూలో జరగనున్నాయి. ఇందులో చైనా, జపాన్, భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు మెయిన్ డ్రా వైల్డ్‌కార్డ్ కోసం పోటీపడతారు. సుమిత్ ఇందులో క్వాలిఫైయర్‌గా కాకుండా మెయిన్ డ్రాలో స్థానం సంపాదించుకున్నాడు. అకారణంగా తిరస్కరణకు గురైన తన వీసా సమస్యను నగాల్ X సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ విషయమై చైనా రాయబారి, సంబంధిత కార్యాలయం నుంచి తక్షణ సాయం కోరుతూ భారతదేశంలోని చైనా రాయబారి షు ఫీహాంగ్, చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్‌లకు ట్యాగ్ చేశాడు. సుమిత్ నగాల్ విషయంపై సోషల్ మీడియా వినియోగదారులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఎందుకు జోక్యం చేస్కోలేదని ఒకరు ప్రశ్నించగా, సాధారణ వ్యక్తులు సులభంగా చైనాకు వెళ్తున్న తరుణంలో ఓ ప్రముఖ అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాడి వీసా తిరస్కరణకు గురికావడం వింతగా ఉందని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కేంద్ర విదేశాంగ శాఖకు ట్యాగ్ చేస్తూ నగాల్ సమస్యను వెంటనే పరిష్కరించాలని వ్యాఖ్యానించారు. భారత్‌లోని అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్లు టోర్నమెంట్లకు వీసా పొందేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తలెత్తడం శోచనీయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ వీసా దరఖాస్తును తిరస్కరించిన చైనా !
الثلاثاء، 11 نوفمبر 2025
China rejects visa application of tennis player Sumit Nagal considered a qualifier for the 2026 Australian Open national sports
ليست هناك تعليقات:
إرسال تعليق