దేశంలో పెరుగుతున్న స్పామ్ మరియు మోసపూరిత కాల్స్‌ను తగ్గించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు తమ వినియోగదారులకు చేసే కాల్స్ కోసం తప్పనిసరిగా '1600' సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్లను మాత్రమే ఉపయోగించాలి. దీని ద్వారా వినియోగదారులు అసలైన కాల్ మరియు మోసపూరిత కాల్‌ను సులభంగా గుర్తించగలుగుతారు. ట్రాయ్ ఈ నియమాన్ని దశలవారీగా అమలు చేయడానికి గడువులను నిర్దేశించింది, ప్రతి రంగానికి ప్రత్యేక సమయములను ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు 2026 జనవరి 1 వరకు ఈ సిరీస్‌లోకి మారవలసి ఉంటుంది. పెద్ద ఎన్బీఎఫ్సీలు , పేమెంట్స్ బ్యాంకులు, మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 2026 ఫిబ్రవరి 1 వరకు మార్పు చేయాలి. మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మార్చి 1 వరకు, క్వాలిఫైడ్ స్టాక్‌బ్రోకర్లు మార్చి 15 వరకు ఈ మార్పును పూర్తిచేయాలి. ట్రాయ్ అంచనాల ప్రకారం, కొత్త నిబంధన అమలుచేయడం వల్ల వినియోగదారుల ఆర్థిక భద్రత మెరుగుపడటమే కాకుండా, సంస్థల పేరుతో జరిగే మోసపూరిత కాల్స్‌ను కూడా తగ్గించగలుగుతాయి.

Post a Comment

أحدث أقدم