క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్‌ను చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కొరియన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నానోబాట్స్ ను బాక్టీరియోబాట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చిన్న సైజులో ఉండే రోబోట్స్ గా చెప్పవచ్చు. క్యాన్సర్ పేషెంట్లలో వీటిని ప్రవేశ పెట్టడం ద్వారా.. అవి కణాల లోపలికి వెళ్లి వాటిని పూర్తిగా నాశనం చేస్తాయని సైంటిస్ట్ లు వెల్లడించారు. మోథెరపీ వంటి అధునాతన శస్త్రచికిత్సల్లో నొప్పి, గాయాలు వంటివి లేకుండా చికిత్స చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయంటున్నారు. ఈ నానోబాట్స్ నానో పార్టికల్స్ అండ్ బయో రెస్పాన్సివ్ సెన్సార్లతో కూడి ఉంటాయని తెలిపారు. నానోబాట్స్‌లోని సూక్ష్మ సాంకేతికత, ఏఐ ఆధారిత ఆల్గారిథమ్స్ కారణంగా అవి శరీరంలోకి ప్రవేశించాక.. రోగుల క్యాన్సర్ కణాలను మాత్రమే నానశనం చేస్తాయని వెల్లడించారు. మిగతా ఆరోగ్య కరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించవని సైంటిస్టులు చెప్పుకొచ్చారు.. ఇటీవలి ల్యాబ్ టెస్టుల్లో జంతువులపై ప్రయోగాలు నిర్వహించామని వారు వెల్లడించారు.. ఈ అతిచిన్న నానోబాట్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సక్సెస్ సాధించామని.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో మరో సాంకేతిక యుగం మొదలవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
ホーム
/
technology
/
క్యాన్సర్ కణాలను, కణితులను నాశనం చేయగల నానోబాట్స్ : అభివృద్ధి చేసిన కొరియన్ శాస్త్రవేత్తలు
الأحد، 16 نوفمبر 2025
arogyam Chonnam National University Developed by Korean scientists health Nanobots that can destroy cancer cells and tumors science technology
ليست هناك تعليقات:
إرسال تعليق