మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం ప్లేయర్ శ్రీచరణిని మంగళగిరి క్రికెట్ స్టేడియంలో సత్కరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో ఆమె భేటీ అయ్యారు. ఏసీఏ అన్ని విధాలుగా తనకు తోడుగా ఉందని శ్రీచరణి తెలిపారు. ఏసీఏ అధ్యక్షులు కేశినేని చిన్ని మద్దతు మరువలేనిదని శ్రీచరణి అన్నారు. శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పినట్లు కేశినేని చిన్ని తెలిపారు. ఉద్యోగంతో పాటు రెండున్నర కోట్ల నగదు, కడపలో స్థలం ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా క్రికెటర్ అకాడమిని త్వరలో ప్రారంభిస్తామని కేశినేని చిన్ని అన్నారు.
శ్రీచరణికి రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق