రిలయన్స్ జియో హోమ్ ప్లాన్‌లో 1000 లైవ్ టీవీ ఛానెళ్లు, 11 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్, 150 Mbps వేగంతో డేటా లభిస్తుంది. నెలవారీ ధర ₹999 + జీఎస్‌టీ చెల్లించాలి. కొత్త కస్టమర్లు కనీసం 3 నెలల పాటు ప్లాన్‌ను తీసుకోవాలి. ఇలా తీసుకునే కస్టమర్‌లకు వై-ఫై రూటర్, ఆండ్రాయిడ్ బాక్స్, రిమోట్ వంటి డివైజ్‌లు లభిస్తాయి. ఈ హోమ్ ప్లాన్‌లో 150 Mbps వేగంతో డేటా ఇవ్వబడుతుంది. ఈ వేగంతో ఒక నెలకు గరిష్టంగా 1000 GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా అయిపోయిన తర్వాత 64 Kbps పోస్ట్ డేటా ఇవ్వబడుతుంది. ఒకే సమయంలో వివిధ డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ డేటాతో పాటు, కస్టమర్‌లు లైవ్ టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ల కోసం ఆండ్రాయిడ్ బాక్స్ లభిస్తుంది. ఇందులో కస్టమర్‌లకు 1000 లైవ్ టీవీ ఛానెళ్లు లభిస్తాయి. ఇందులో HD ఛానెళ్లు కూడా ఉంటాయి. ఇందులో అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్ , సోనీ లివ్ (Sony Liv), జీ5, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ ప్లస్ లభిస్తాయి. అలాగే, టైమ్స్ ప్లే , తరంగ్ ప్లస్, ఈరోస్ నౌ, లయన్స్‌గేట్ ప్లే వంటి యాప్‌లు లభిస్తాయి. షీమరూ మీ, ఈటీవీ విన్ వంటి ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ జియో ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్‌లకు మాత్రమే లభిస్తుంది. ఆ ప్రాంతాల్లోని కస్టమర్‌లు జియో వెబ్‌సైట్‌లో మరియు జియో స్టోర్‌లలో బుక్ చేసుకోవచ్చు. అలాగే జియో ₹599+ జీఎస్‌టీ ప్లాన్ కూడా వుంది. కొత్త కస్టమర్‌లు దీన్ని కూడా కనీసం 3 నెలల పాటు మాత్రమే తీసుకోవాలి. ఈ ప్లాన్‌లో కేవలం 30 Mbps వేగంతో మాత్రమే డేటా లభిస్తుంది. దీనికి కూడా 1000 GB నెలవారీ పరిమితి మరియు 64 Kbps పోస్ట్ డేటా ఇవ్వబడుతుంది. 1000 లైవ్ టీవీ ఛానెళ్ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ లో జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ ప్లస్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్, ఈరోస్ నౌ లభిస్తాయి. షీమరూ మీ, ఈటీవీ విన్ సపోర్ట్ లభిస్తుంది.
జియో హోమ్ పాపులర్ ప్లాన్ :1000 టీవీ ఛానెళ్లు, 11 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, 150 Mbps స్పీడ్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق