మోంథా తుపాను వల్ల మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్‌లోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 765 హైవేపై హైదరాబాద్‌- శ్రీశైలం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా మళ్లించారు. వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. మరోవైపు ఎడతెరపి లేని వర్షానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిగురుటాకులా వణికింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో సుమారు రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم