మాజీ టీం ఇండియా కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్ణానం ప్రకటించింది.ఆయన అక్టోబర్ 31న ఉదయం 11 గంటలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది. దీంతో ఎమ్మెల్సీగా చేసి ఆయన్ని హైదరాబాద్ నుంచి మంత్రిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత, అజారుద్దీన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజారుద్దీన్ గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Post a Comment

أحدث أقدم