మణిపూర్ లోని మిలిటెంట్లు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్టార్ లింక్' నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు 'ది గార్డియన్' పత్రిక కథనం పేర్కొంది. మణిపూర్‌లో అధికారులు స్థానికంగా ఇంటర్నెట్ నిలిపివేసిన సమయంలో మిలిటెంట్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్ నుంచి ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో 'స్టార్‌లింక్'కు చట్టబద్ధంగా అనుమతి లేదు. కానీ, మణిపుర్ పొరుగున ఉన్న మయన్మార్‌లో మాత్రం దీనిని అనుమతించినట్లు వెల్లడించింది. సరిహద్దు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలను వినియోగించుకుంటున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీని సేవలు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్టార్‌లింక్ భారత్‌లోనూ అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి.
'స్టార్‌లింక్'ను వినియోగిస్తున్న మణిపూర్ మిలిటెంట్లు ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق