హైదరాబాద్ సిటీలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్ బస్సులు గ్రేటర్ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది. ఈవీ బస్సుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అన్ని రూట్లలో వీటిని నడిపేలా రూట్ మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రద్దీప్రాంతాల్లో సూపర్ వైజర్లను నియమిస్తూ ప్రయాణికుల సంఖ్య పెంచుకునే అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. హయత్‌నగర్ డిపో 2కు త్వరలో 45 ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వాటిని ఏయే రూట్లలో నడపాలనే ముందస్తు రూట్‌మ్యా్‌పలు సిద్ధం చేస్తున్నారు. లాంగ్ రూట్లలో ఈవీ బస్సులు నడుపుతూ ఎలక్ర్టిక్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 90శాతం నమోదయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025లో గ్రేటర్‌జోన్ పరిధిలోని 25 బస్‌డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. శివారు ప్రాంతాల ప్రయాణికులే లక్ష్యంగా కొత్తరూట్లను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.
إرسال تعليق