తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం స్పందించింది. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని, మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని వెల్లడించింది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వా మ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చిందని హక్కుల సంఘం ఆరోపించింది. కాంగ్రెస్ మళ్లీ ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మార్చేసిందని లేఖలో పౌర హక్కుల కమిటీ ఆగ్రహం కనబర్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రిని కలిసిన సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్‌ను రాష్ట్రంలో అమలు పరిచే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని హక్కుల కమిటీ లేఖలో వెల్లడించింది. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బందాలను అమలు పరుస్తూ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపడాన్నిపౌర హక్కుల సంఘం, రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
إرسال تعليق