భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ప్రతిష్ఠాత్మకమైన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రోబా-3 అనే రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది.ఈ ఉపగ్రహాలను PSLV రాకెట్‌లోని ప్రత్యేకమైన భాగమైన పేలోడ్ ఫెయిరింగ్‌లో ఉంచారు. ఈ మిషన్‌ కోసం, ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV రాకెట్ XL వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఇస్రో దగ్గర ఉన్న మొత్తం 5 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ వేరియంట్స్‌లో మోస్ట్ పవర్‌ ఫుల్ రాకెట్‌గా PSLV-XL నిలుస్తోంది. ఈ రాకెట్ సాధారణ PSLV కంటే చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే దీని చుట్టూ ఆరు పెద్ద బూస్టర్లు అటాచ్ అయి ఉంటాయి. ఒక్కో బూస్టర్ 12 టన్నుల ప్రొపెల్లెంట్ (రాకెట్‌కు ఫ్యూయల్ లాంటిది) క్యారీ చేయగలదు. ఈ బూస్టర్లు రాకెట్‌కు ఎక్స్‌ట్రా పవర్ అందిస్తాయి. దీని వల్ల PSLV-XL, సాధారణ PSLV కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. నార్మల్ PSLVకి నాలుగు బూస్టర్లు మాత్రమే ఉంటాయి. PSLV-XL తన అధిక శక్తి వల్ల సింగిల్ మిషన్‌లో చాలా శాటిలైట్స్ లాంచ్ లాంచ్ చేసింది. ఇది భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇంటర్ ప్లానిటరీ శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపే పని చేస్తుంది. ఇప్పటి వరకు చాలా సార్లు ఈ రాకెట్‌ను ఉపయోగించి చాలా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి సురక్షితంగా చేర్చగలిగారు. లిఫ్ట్-ఆఫ్ వద్ద PSLV-XL 320 టన్నులు అంటే (ఫ్యూయల్ &పేలోడ్‌తో సహా) 3,20,000 కిలోగ్రాముల బరువు ఉంటుంది. రాకెట్ థ్రస్ట్, భారీ పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యాన్ని లెక్కించేటప్పుడు ఈ బరువు చాలా కీలకం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ  అభివృద్ధి చేసిన ప్రోబా-3 ఉపగ్రహంతో సూర్యుడిని గురించి మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు. PSLV-XL రాకెట్ ఈ ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశ పెడుతుంది. ఈ రాకెట్ సాధారణ PSLV రాకెట్‌లానే 4 స్టేజ్ సిస్టమ్‌తో కూడి ఉంటుంది. ఈ సిస్టమ్ భాగాలు సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ రెండింటినీ ఉపయోగించి రాకెట్‌ను అంతరిక్షంలోకి నడిపిస్తాయి. ఈ రెండు రకాల ఇంధనాల కలయిక వల్ల రాకెట్‌కు అధిక శక్తి లభిస్తుంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో సూర్యుడి గురించిన జ్ఞానాన్ని మరింత పెంచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. అంతేకాకుండా, దీంతో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం రంగంలో భారతదేశం మరో ముందడుగు వేయనుంది.తన అఫీషియల్ X అకౌంట్‌లో "దేశీయ కాలమానం ప్రకారం, 2024, డిసెంబర్ 4న మధ్యాహ్నం 4:08 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C59 రాకెట్‌పై ప్రోబా-3 ట్విన్ శాటిలైట్స్ ప్రయోగించనున్నాం." అని తెలిపింది. ఇవి రెండూ కలిసి సూర్యుడిని చాలా కచ్చితత్వంతో అబ్జర్వ్ చేస్తాయి. ప్రోబా-3 ఉపగ్రహాలు కలిసి సోలార్ కరోనాగ్రాఫ్ అనే 144 మీటర్ల పొడవున్న ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఏర్పరుస్తాయి. ప్రోబా-3 ఉపగ్రహాలను భూమి చుట్టూ ఒక విచిత్రమైన ఆకారంలో తిప్పేలా చేస్తారు. ఈ కక్ష్యలో తిరుగుతూ ఉండగా, అవి భూమి నుంచి 60,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి, కొన్నిసార్లు భూమికి 600 కిలోమీటర్లు దగ్గరగా కూడా వస్తాయి. ఈ రెండు ఉపగ్రహాలు కలిసి పని చేసి సూర్యుడి కరోనాను స్పష్టంగా చూడడానికి అనువైన పరిస్థితులను సృష్టిస్తాయి. దీని ద్వారా శాస్త్రవేత్తలు సూర్యుడి కరోనా గురించి మరింత బాగా అధ్యయనం చేయగలుగుతారు. సూర్యుడిపై సంభవించే వివిధ రకాల మార్పులను ముందే తెలుసుకుంటారు. ఇది భూమిపై ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్స్, విద్యుత్ గ్రిడ్‌లు మొదలైన వాటిపై ప్రభావం చూపే సోలార్ తుఫానుల గురించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికి సహాయపడుతుంది.

Post a Comment

أحدث أقدم