టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరును మార్చుకోవడంపై సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒకవైపు బిజినెస్, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న మస్క్, తాజాగా తన ఎక్స్ అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్'గా మార్చుకున్నారు. వినడానికి ఈ పేరు వింతగా ఉన్నప్పటికీ దీనికో అర్థం కూడా ఉంది. కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఇలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే తన ఎక్స్ ఖాతా పేరును క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలా మార్చుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2023లో కూడా తన ఎక్స్ అకౌంట్ పేరును 'మిస్టర్ ట్వీట్'గా మార్చుకున్నారు.

Post a Comment

أحدث أقدم