పుష్ఫ -2 ప్రీమియర్ షో తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరించి తీరును ప్రశంసించారు. సినీ ఇండస్ట్రీకి రేవంత్ మద్దతుగా నిలిచారని అభినందించారు. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసి.. పొరపాట్లు హీరో మీద వేసేసారని వ్యాఖ్యానించారు. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తన జిల్లాల పర్యటనల గురించి పవన్ కీలక అంశాలను వెల్లడించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన పవన్ కల్యాణ్ అనూహ్య వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ ను ఒంటరి చేసారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కాబట్టే హీరో నీ అరెస్టు చేయగలిగారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో రేవంత్ పరిపాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారుని అభినందించారు. పుష్ప బెనిఫిట్ షో కి టికెట్ ధరలు పెంచడం కూడా సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే కదా అంటూ పవన్ వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అరెస్ట్ చేసారనడం సరైంది కాదని పేర్కొన్నారు. రేవంత్ ఎప్పుడో ఆస్థాయి దాటిపోయారని పవన్ పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم