ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో 'కేటీఆర్ నాట్ టు అరెస్ట్'ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు.
30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించిన హైకోర్టు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق