తెలంగాణలో కుటుంబ సర్వే దరఖాస్తులు నడిరోడ్డుపై పడటాన్ని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తప్పుబట్టారు. నాడు ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డెక్కితే, నేడు ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు మళ్లీ రోడ్డెక్కాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు చేయడమేనా సర్వే లక్ష్యమని ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతోందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరిని ఖండించారు. ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సర్వే దరఖాస్తులు నడిరోడ్డుపై పడటాన్ని తప్పుబట్టిన హరీశ్‌రావు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق