టీచర్  క్లాస్‌రూమ్‌లో విచిత్రంగా పాఠాలు చెబుతూ వైరల్ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. @veejuparmar అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి ఓ ఫిజిక్స్ టీచర్. అతడు క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఫిజిక్స్ పాఠం బోధిస్తున్నాడు. బోర్డు మీద రాసిన తర్వాత వెనక్కి తిరిగి హఠాత్తుగా విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. విద్యార్థుల వైపు తిరిగి వింత శబ్దాలు చేయడం ప్రారంభించాడు. కొన్నిసార్లు నవ్వుతూ, కొన్నిసార్లు అరుస్తూ, కొన్నిసార్లు మొహంపై రుద్దుకుంటూ భయపెడుతున్నాడు. అతడు కావాలని అలా చేస్తున్నాడో, అతడికేమైనా అయిందో ఆ వీడియో చూసిన వారికి అర్థం కావడం లేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 58 వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``అతడిని న్యూటన్ ఆత్మ ఆవహించిందేమో``, ``ఫిజిక్స్ లెక్చరర్ల పరిస్థితి ఒక్కోసారి అలాగే ఉంటుంది``, ``అతడు క్వంటమ్ ఫిజిక్స్ చెబుతున్నట్టున్నాడు``, ``అతడు యాక్టర్ కాబోయి టీచర్ అయినట్టున్నాడు``, ``ఫిజిక్స్ క్లాస్ ఎప్పుడూ హారర్ సినిమాలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Post a Comment

أحدث أقدم