సినీ నటుడు నారా రోహిత్ ఓ ఇంటివాడు కానున్నారు. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరితో నారా రోహిత్ వివాహం జరుగనుంది. ఆదివారం ఈ జంట కు ఎంగేజ్మెంట్ జరిగింది. నారా చంద్రబాబు తో పాటు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కు హాజరైయ్యారు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగనుంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.

Post a Comment

أحدث أقدم