లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజాకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్‌పై మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కంప్లయింట్ చేసింది. దీనిపై మల్లిక్ తేజ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. నిరాధార ఆరోపణలు చేశారంటూ మల్లిక్ తేజ్ తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు... మల్లిక్ తేజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
إرسال تعليق