ప్రముఖ నటుడు విజయ కుమార్ పెద్ద కూతురు వనిత. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం పలు చిత్రాల్లో చేసింది. 2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూతురు పుట్టింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో ఇతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది. కాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ని మూడో పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే ఇది పెటాకులైంది. అయితే ఆయనతో తన పెళ్లి జరగలేదని, ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరిగిందని వనిత వివరణ ఇచ్చింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ రాబర్ట్‌నే ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుంది. వనిత వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
إرسال تعليق