తెలంగాణలో ఉన్న పథకాలను బంద్ పెట్టడమే కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు అంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చీర కాదు, రెండు చీరలు అని దసరా పండగకు అక్కా చెల్లెమ్మలను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. రైతుబంధు 15 వేలు ఇస్తామని ఇప్పటివరకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. ముదిరాజ్, గంగపుత్రులంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపు. అక్టోబర్ వచ్చినా చెరువుల్లో చేప పిల్లలను వేయలేదన్నారు. తమ ప్రభుత్వం చేప పిల్లల కోసం వంద కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్‌లో 16 కోట్లు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్భిణీ స్త్రీలను మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు.
తెలంగాణలో ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق